రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చంద్రబాబును ఒంటరిపాటు చేస్తున్నాయి. అపర చాణక్యుడిగా నాలుగేళ్లపాటు కీర్తింపబడిన చంద్రబాబు ప్రస్తుతం తత్తరపడి పోతున్నారని సొంత పార్టీ వారే అంటున్నారు. చంద్రబాబు బిత్తర చూపులు అర్థమయి తెలుగు తమ్ముళ్లు పక్క చూపులు చూస్తున్నారని, రాజకీయ వలసలు తెలుగు దేశంలో జోరందుకోబోతున్నాయని అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే భవిష్యత్ రాజకీయ చిత్రపటం చంద్రబాబుకు అనుకూలంగా లేదన్న వాదనలకు బలం చేకూరుతున్నది.
ఈ పరిస్థితికి చంద్రబాబు అనుసరించిన అవకాశవాద వైఖరే ప్రధాన కారణం. మూడేళ్ళ కిందటే ప్రత్యేక హోదా రాదని తేలిపోయినా, ఈ నాలుగేళ్ళు బిజెపితో అంట కాగడం ఆయన చేసిన పెద్ద తప్పు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తుంటే … హోదా సంజీవని కాదు, హోదా కంటే మెరుగైన నిధులు, ఫలితాలు సాధిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు.
హోదా ఇవ్వలేమని కేంద్ర పెద్దలు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పలుమార్లు ప్రకటనలు చేసినా బాబుగారు అస్త్ర సన్యాసం చేసి జీహుజూర్ అంటూ కేంద్రానికి వంత పాడటం మరో తప్పు. ప్రత్యేక హోదాను అడిగిన వామపక్షాలపై, ప్రధాన ప్రతిపక్షంపై నిర్భంద కాండను యథేచ్ఛగా చంద్రబాబు సాగించడం మరో తీవ్ర తప్పిదం.
రాష్ట్రంలో ప్రతిపక్షాలనేవే లేవని తానే సర్వాంతర్యామి అన్నట్టుగా, తనను ప్రశ్నించే వారి పట్ల అమానుషంగా వ్యవహరించారు.
తెలుగుదేశం లోని ఇతర నేతలను సైతం అధికారులు లెక్క చేయటం లేదు. చంద్రబాబు, చినబాబుల ‘హవా’ తప్ప మరొకరి మాట చెల్లుబాటు కాలేదు. జిల్లాలలో మంత్రులు, ఎంఎల్‌ఏల మాటకు అధికారుల వద్ద విలువ లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది.
తాను మారిన మనిషినని పదే పదే చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మారకపోగా మరింత చాదస్తంగా తయారయ్యారని పలువురు సీనియర్ ఐఏఎస్‌లు అనేకసార్లు వ్యాఖ్యానించారు. చెప్పిందే చెప్పుకోవటం, గంటల తరబడి మాట్లాడటం, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు అంటూ ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ దాకా పనులు విడిచి కాలయాపనలు చేయటం ఈ కాలంలో పరిపాటి అయింది.
అభివృద్ధి పేర రాష్ట్రంలో మాయా ప్రపంచాన్ని సృష్టించాలను కున్నారు చంద్రబాబు. అందుకోసం మీడియా, సోషల్ మీడియాను వేదిక చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని ఈవెంట్లుగా మార్చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు, రాజకీయ వేదికలు ఏవైనా చంద్రబాబు భజన పరిపాటి అయిపోయింది.
రాష్ట్రంలో 1000కి పైగా పరిశ్రమలు, 10 లక్షల మందికి ఉపాధి, నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని బాబుగారు పదే, పదే చెప్పేవారు. ప్రపంచ రాజధానులను తలపించే రాజధాని నిర్మాణం చేస్తున్నానని నిత్యం హంగామా చేసేవారు! రైతాంగం గురించి కానీ, వ్యవసాయ కూలీలు, భూములు కోల్పోతున్న ప్రజలు, కనీస వేతనం పెరుగుదలకై వేచి ఉన్న కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకున్న పాపానపోలేదు.
-ప్రజాశక్తి , Apr 10, 2018
పట్టిసీమ అవినీతి పుట్ట ,పట్టిసీమ లో ట్రాక్టర్ మట్టి తీస్తే 63 వేలు చెల్లించారు అంటే ఎంత దోపిడీ జరిగిందో ? BJP MLA విష్ణు కుమార్ రాజు
(ట్రాక్టర్ మట్టి తీస్తే 1500 ఇస్తారు )
1600 కోట్ల పట్టి సీమ లో 400 కోట్ల అవినీతి జరిగింది అని కాగ్( కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ) చెప్పింది
‘నలుగురు’ ఏపీ మంత్రులకు చిక్కులు తప్పవా!
-TeluguGateway
కేంద్రంలోని ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి ఏపీలోని కొంత మంది మంత్రులు..అధికారుల్లో కంటి మీద కునుకు కరవైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి తమపై దాడి మొదలవుతుందో అన్న టెన్షన్ వారిలో నెలకొంది.
ఏపీకి చెందిన నలుగురు కీలక మంత్రులకు సంబంధించిన అవినీతి చిట్టాను కేంద్రం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇప్పటికే కొంత మంది ఐఏఎస్ అధికారుల వ్యవహారాలను ఢిల్లీ పెద్దలు రెడీ చేసిపెట్టుకున్నారు.
ఏ క్షణంలో అయినా వీరిపై చర్యలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కా ఆధారాలతో ముందుకు సాగటానికి కేంద్రం రెడీ అవుతోందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు అన్నీ ఢిల్లీలో కీలకంగా ఉన్న ఓ నేతకు పూసగుచ్చినట్లు నివేదించినట్లు సమాచారం. అన్ని వివరాలు అందజేసినందుకు గాను ‘దాడి’ నుంచి తనను మినహాయించాలని ఆయన కోరుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఎందుకంటే ఆయనది కూడా ప్రభుత్వంలో చాలా కీలక పాత్రే.
ఇక మంత్రుల విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వంలో అవినీతి భారీ స్థాయిలో ఉన్న శాఖలు ఏవో ఆ మంత్రులకు సంబంధించి చిక్కులు తప్పవని చెబుతున్నారు.
సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తనపై కోపంపై ఇతరులపై దాడి చేసే అవకాశం ఉందని..దేనికైనా రెడీగా ఉండాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో సాగిన అడ్డగోలు వ్యవహారాలన్నీ చంద్రబాబుకు మించి మరెవరికీ తెలియవు కదా? అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఈ ఏప్రిల్, మే నెలల్లో రాజకీయంగా ఏపీలో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే.
కేంద్రం ఎవరిని లక్ష్యంగా చేసుకున్నా..తాము హోదా అడుగుతున్నందునే ఇలా చేస్తున్నారని చెప్పుకునేందుకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయి ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
అందులో భాగమే ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా వంటి కీలక నిర్ణయాలు అని విశ్లేషించారు.