Link to the article published in economic times
కాంగ్రెస్ హైకమాండ్ మాటంటే శిలాశాస నం. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. అధిష్ఠానం మాట ధిక్కరిస్తే శంకరిగిరి మాన్యాలు తప్పవన్న అనుభవంతో కొమ్ము లుతిరిగిన మహామహులు కూడా అధి ష్ఠానం శరణువేడుతుంటారు.కానీ..పులి లాంటి కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన ఒక మాజీ ఎంపీ ముందు పిల్లి అయిపోయింది. తన కార్యక్షేత్రానికే వచ్చి, తన పార్టీ ఎమ్మెల్యేలనే తీసుకువచ్చి తనను సవాల్ చేసిన జగన్ ఇచ్చిన ఝలక్‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా షాక్ తిన్నారు. ఏం చేయాలో తెలియక, నోట మాట రాక బేలగా మారారు. తన దయాదాక్షిణ్యాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతోందంటూ 36 ఏళ్ల యువనేత విసిరిన సవాలుకు జవాబు లేక అధిష్ఠానం గింగిరాలు తిరుగుతోంది. జగన్ వెంట నిలిచిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలో వ ద్దో కూడా తెలియక అంతర్మథనం చెందు తోంది. తన చుట్టూ అంతమంది మేధా వులు ఉన్నా, ఒక్కరి మేధస్సూ ఎమ్మెల్యే లను అడ్డుకోకుండా పోయిందన్న క్రోధంతో అధినేత్రి అల్లాడిపోతున్నారు. తాను టికెట్లు ఇచ్చి గెలిపించిన 28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలను ఢిల్లీకి తీసుకువచ్చి, నేరుగా తననే సవాల్ చేసిన జగన్ గుండెధైర్యానికి సోనియాగాంధీ నోట మాట రాక అవాక్క వలసిన దుస్థితి ఏర్పడింది. ఓదార్పు యాత్ర నుంచి జగన్‌ను వెన్నాడి, ఆయనంతట ఆయనే పార్టీని వీడేలా కాంగ్రెస్ నాయ కత్వం పన్నిన వ్యూహం విజయవంత మయినప్పటికీ.. ఆ తర్వాత అదే తన పాలిట శాపంలా మారుతుందని, అదే జగన్ తనను సవాల్ చేస్తారని ఏమాత్రం ఊహిం చని కాంగ్రెస్ నాయకత్వం మంగ ళవారం నాటి జగన్ బలప్రదర్శనతో బిత్తర పోయింది. జగన్ వెంట వచ్చిన28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు తీసు కోవాలో కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడు తోంది. వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మునిగి పోతుందన్న భయం, తీసుకోకపోతే ఇంత పలకుబడి, ప్రతిష్ఠ ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో మరగుజ్జు అవు తుందన్న సంకేతాలు వెళతాయన్న ప్రతిష్ఠ అధి ష్ఠానాన్ని వెన్నాడుతోంది. దీనితో రాష్టప్రతి పాలన పెట్టి తన పరువు కాపాడుకోవడమే పరిష్కారంగా భావిస్తున్నట్లు సమాచారం. అసలు పరిస్థితి ఇంతదాకా వస్తుందని గ్రహించని నాయకత్వం రాష్ట్ర పరిణామాలపై అంచనాకు రాలేని ఇన్చార్జి వీరప్పమొయిలీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిపై ఆగ్రహంతో ఉంది. ప్రధానంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఘోర వైఫల్యం చెందారని మండిపడుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. జగన్‌ను అణచివేస్తానన్న హామీతో సీఎం పదవి పొందిన కిరణ్, ఆచరణలో తాను వైఫల్యం చెందడమే కాకుండా, అధిష్ఠానం పరువును మంటకలిపారన్న మండిపాటుతో ఉంది. సీఎం.. పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని, జగన్‌ను అంచనా వేయడంలో కిరణ్ అనుభవం-వయసు సరిపోలేదన్న వాస్తవాన్ని నాయకత్వం ఆలస్యంగా గ్రహించింది. ముఖ్య మంత్రి కిరణ్, ఇన్చార్జి వీరప్ప మొయిలీ, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అంతా కలసి అధిష్ఠానాన్ని అప్రతిష్ఠ పాలుచేశారని, రాజకీయాల్లో రెండేళ్ల అనుభవ మయినా లేని జగన్ ముందు తలదించుకునేలా చేశారని నాయకత్వం భగభగలాడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ చివరకు ఒక మాజీ ఎంపీ దయాభిక్షపై ప్రభుత్వ మనుగడ సాగుతోందన్న సంకేతాలు వెళ్లడాన్ని జీర్ణించు కోలేకపోతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువచ్చి, జగన్ తనను సవాల్ చేస్తే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోవలసి వచ్చిందని ఉడికిపోతోంది. ఇంతమంది ఉండి కూడా ఎమ్మె ల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా నియం త్రించలేకపోయారన్న ఆగ్రహంతో నాయకత్వం ఊగిపోతోంది. ఢిల్లీ చరిత్రలో రాత్రి 8.30 వరకూ ధర్నా చేసిన ఏకైక నేతగా జగన్ రికార్డు సృష్టించడం, దానికితోడు రైతుల కోసం అరెస్టయ్యారన్న సానుభూతి ప్రజల్లో సంపాదిం చుకోవడం అస్సలు మింగుడుపడకుండా ఉంది.జగన్ ఢిల్లీ యాత్ర తేదీని ప్రకటించిన రోజునే ఎమ్మెల్యేలు ఢిల్లీకి రాకుండా చూడాలని అహ్మద్‌పటేల్, ప్రణబ్‌ముఖర్జీ, మొయిలీ వంటి మేధావులు ముఖ్యమంత్రి కిరణ్‌ను హెచ్చరించినా.. ఆయన ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటి పోయిందని అధిష్ఠానం భావిస్తోంది. ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, హైదరాబాద్‌లో ఉండి ఫోన్లపై నడిపించడం వల్ల తాము జగన్ ముందు అప్రతిష్ఠ పాలుకావలసి వచ్చిందని అధిష్ఠానం మండిపడుతోంది
Filed under Best Articles on YSR and Jagan
Thank you Sudhir for the article. It is really in an insight into our leader Y S Jagan’s decision making process.
“The manner in which my uncle, Y S Vivekananda Reddy was picked up from Hyderabad, taken to Delhi, made to meet Sonia Gandhi, all in one day, what am I to make of it? It was all planned to create fissures and to show Jagan does not have support within his own family.”
-Jagan
His hyperactive net-savvy supporters are mentioning December 21, his birthday, as the big day when he will announce his party. I tell him that December 9, Sonia’s birthday, strangely is another date mentioned on the web. He smiles and says “December 9 is also my wife’s birthday”.
Filed under Best Articles on YSR and Jagan
Dear Friends,
Please click on the link below. It’s a well written article about the present situation.
Why?
PS: One request to the blogers and YSJ’s fans. Please do not say anything bad or encourage anyone indulging in bad behavior with Y S Vivekanada Reddy garu. All said and done he is Y S Jagan’s own Babai and it is minimum decency not indulge in violent behavior. Today’s actions by some of YSJ’s fans was uncalled for and should be condemned at any cost. The channels are only going to take such things as examples of our leader. As our leader said that YSV is still part of the family and shall remain so for ever. If we as fans indulge in such activities it’s going to only going to show us in poor light and also widen the gap between YSV and YSJ.
Filed under Best Articles on YSR and Jagan