Part 1:
ఇపుడు నేను రాయబోయేది మీకు అసందర్భంగా అనిపించవచ్చు . కాని పూర్తిగా చదివిన తర్వాత దాని గురించి కామెంట్ చేయండి.
కొన్ని రోజుల కిందట మన దేశపు యువరాజు గారు అయిన రాహుల్ గారు ….పనిపాట లేక , మాట్లాడటానికి ఏమి దొరక్క ఆరెస్సెస్ మీద పడ్డారు . ఆరెస్సెస్ మరియు సిమి ఒకటే అని మనకు జ్ఞానోదయం చేసారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనారిటీల పక్షపాతిగా ఉండి ఉగ్రవాదాన్ని సమగ్రంగా ఎదుర్కోలేక పోతోంది అని పదే పదే వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక దానికి కౌంటర్ గా ‘హిందూ’ ఉగ్రవాదాన్ని కనిపెట్టి దాని మీద అలుపెరగని పోరాటం చేస్తాము అని ప్రకటనలు ఇస్తోంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది.
దేశం లో ఉగ్రవాదాన్ని ఆపలేని చేతగాని తనం, వరుసగా బయటపడుతున్న కుంభకోణాలు, కోల్పోతున్న ఆకర్షణా , 2004 నుండి 2009 వరకు అంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పని చేస్తున్నాము అనే ధీమా రెండవ సారి ఎన్నికలు గెలిచిన తర్వాత లేకపోవటం, 2004 లో పీడకుల (బీజేపి ) నుండి రక్షించే ఆపన్న ‘హస్తం’ అన్న హోదా కాస్తా ఇపుడు వరుసగా రెండు సార్లు చేపట్టిన అధికారం వలన అణిచివేసే ‘హస్తం ‘ గా మారిపోవటం , రామజన్మ భూమి కేసు లో హిందూ సంస్థలకు అనుకూలంగా తీరు రావటం , ఆ తీర్పును చచ్చినట్లు ఒప్పుకోవలసిన అగత్యం, దాని వలన మైనారిటీలకు ఎక్కడ కోపం వచ్చి తమ వోట్ లు గల్లంతు అవుతాయో అనే భయం …ఇవన్ని కలిపి కలిగిస్తున్న భయం కాంగ్రెస్ పార్టీ లో అర్ధం లేని వ్యూహాల వైపు అడుగేసేలా అధిష్టానం నాయకులను పురిగోలుపుతోంది.
మీకు అందరికి గుర్తు ఉందనుకుంటున్నాను…. 2004 లో బీజేపి ప్రభుత్వానికి ఏ నినాదాలు లేక ఉగ్రవాదం గురించి , వెలిగిపోతున్న భారత దేశం గురించి అరవటం వల్ల ఆ పార్టీ ఎంత నష్టపోయిందో అందరికి తెలుసు. ఈ రోజు ఘనత వహించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే పనిలో పడింది. లేని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించడం, ఆరెస్సెస్ లాంటి సంస్థలను రెచ్చగొట్టడం ..ఇవన్ని ఆత్మహత్యా సద్రుశ్యాలు. ఉత్తర ప్రదేశ్ లో మంచి వ్యూహం వేసి ఇరగ దీసి లోక్ సభ సీట్లు తెచ్చాడు అని పోగిడించుకుంటున్న రాహులుడు ….ఇప్పుడు ఆరెస్సెస్ ను సిమి తో పోల్చి తన ప్రతిభా పాటవాలు ఏపాటివో నిరూపించుకున్నారు.
పైన వివరించిన చర్యలు అన్ని కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న అభద్రతా భావాలను , చేతగాని తనాలను బయటపెడుతున్నాయి. ౩౩ సీట్లు సంపాదించి పెట్టిన నాయకుడికి , అతడి రాష్ట్రానికి అన్యాయం చేయటం , చేతగాని వారిని సమర్ధుల బదులు తమ ప్రతినిధులుగా ఎంచుకోవటం ….కాంగ్రెస్ మహాశయులారా ఎటువైపు మీ పయనం ? ఎందుకు మీ దిగజారుడు తనం ? పడుకొని ఉన్న ఆరెస్సెస్ ని నిద్రలేపి తొలి సారిగా వీధులలో ధర్నాలు చేసే స్థాయికి తీసుకుపోవటం ఒక దారుణం అయిన mis-strategy. హిందూ సంస్థలు మళ్ళీ ఒకటి కావడానికి ఊతం ఇచ్చారు .
పార్టీ కి పనికి వచ్చే వారిని చీకోట్టడం , ఎదుగుతున్న వారిని చూసి సహించలేక పోవటం , పనికి రాని వ్యూహాలు వేయటం ….మీ పతనాన్ని మీరే రాసుకుంటున్నారు.
Part 2:
ఇప్పుడే వార్తలు చూసాను . సోనియా అమ్మ మీద ఆరెస్సెస్ మాజీ అధినేత సుదర్శన్ చేసిన వ్యాఖలకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేస్తోంది . బషీర్ భాగ్ వద్ద జరిగే ధర్నా కు మన రోశయ్య గారు వెళ్తున్నారు. ఆరెస్సెస్ ని సిమి తో పోల్చి నపుడు ఆరెస్సెస్ వాళ్ళు హుందాగా స్పందించారు. కాని దాని తర్వాత వరుసగా జరుగుతున్న చర్యల వలన వాళ్ళు ధర్నా చేయవలసి వచ్చింది. ఆరెస్సెస్ వీధుల్లోకి రావటం వలన దేశం లో ప్రజల మధ్య చర్చ జరగటం , రొటీన్గా కొంత మంది ఆరెస్సెస్ ని సపోర్ట్ చేయటం జరుగుతుంది . ఇటువంటి దారుణం అయిన పని చేసి కూడా రాహుల్ గాంధి గారు హ్యాపీ గా తిరుగుతున్నారు. అందరూ అనుకునట్లు ఆరెస్సెస్ వాళ్ళు విధ్వంసం చేయలేదు . ఆరోపించబడి కూడా తొణకలేదు . మరి మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు? ముసలాయన సుదర్శన్ ఆవేశం లో అన్న మాటను పట్టుకొని హడావుడి చేస్తున్నారు. అధికారం లో ఉంది కూడా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారు . మళ్ళీ ఈ ధర్నాలకు ముఖ్యమంత్రులు హాజరు అవుతున్నారు . గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది ఈ పద్ధతి.
ఇదే వైఎస్సార్ అయి వుంటే ….. తన మీద సుదర్శన్ లాంటి వ్యక్తి అటువంటి ఆరోపణ చేసి ఉంటె హుందాగా ఒక నవ్వు నవ్వి ….. లైట్ తీస్కోండి బాస్ అని అనేవాడు. కాని మన సోనియా అమ్మ వారు చేస్తున్నది ఏమిటి ? ముఖ్యమంత్రులతో సహా అందరిని వీధుల్లోకి తోలి ధర్నాలు చేయిస్తున్నారు. ఇది దేనికి నిదర్శనం ? నిన్ను ఒక మాట కూడా అనకూడదా తల్లీ ? నిన్ను ఒక మాట అంటే దేశం మొత్తాన్ని స్తంభింపజేస్తావా? నీ కన్నా బాల ధాకరే నయం . నిన్ను ఒక మాట అంటే పెట్రేగి పోవటం తప్ప మీ ప్రభుత్వానికి , మీ పార్టీ కి దేశం లో సమస్యలు , వరుసగా బయట పడుతున్న కుంభకోణాలు కనపడటం లేదా ? మా పోలవరం , ప్రాణ హితా, మా తెలంగాణా , అస్సాం లో ఉగ్రవాదం , కాశ్మీర్ లో స్తంభించిన జన జీవనం , విదర్భ లో కొనసాగుతున్న రైతుల ఆత్మా హత్యలు …. ఎన్ని లేవు తల్లీ ? వీటన్నిటి కంటే మీ ఘనత వహించిన కాంగ్రెస్ శ్రేణులకు మిమ్మలిని ఒక మాట అనటం తీరని బాధని కలిగించిందా ? అవును , అనిపించి ఉంటుంది … అప్పుడు ఎపుడో వైఎస్సార్ వెళ్ళిపోయి జగన్ ని సీఎం చేయాలని ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మేలేలూ అడుగుతుంటే ..మీ నమ్మిన బంటు (అదే మీ అత్త గారిని భయంకరం గా తిట్టి గాంధీ కుటుంబానికి విధేయుడిని అని చెప్పుకునే ) హనుమంతరావు అన్నాడు ” సోనియా అమ్మ నిర్ణయం కంటే ప్రజల కోరిక , ఎమ్మెలేల కోరికా , కార్య కర్తల కోరికా గొప్పవా ? ” అని నిస్సిగ్గుగా , నీచంగా , యావత్తు ప్రజాస్వామ్య భారతం తల దిన్చుకునేలాగా మన స్వామ్యాన్ని నయా రాచరికంగా మార్చిన మీ పార్టీ వాళ్ళకు మిమ్మలిని ఒక మాట అనటం నిజంగా గుండెల్లో గునపం దిన్చినట్లే అనిపించవచ్చు .
తప్పు మీది కాదు తల్లీ … వైఎస్సార్ మొహం చూసి మీకు వోటు వేసిన మాది . ఇంకో సారి ఆ తప్పు చేస్తే రష్యా ను పాలించిన స్టాలిన్ కన్నా నీచమయిన నిరంకుశత్వాన్ని తెచ్చినట్లే . బహుశా మీ అత్త గారు ఇలాంటి పొగరు తలకు ఎక్కే అప్పట్లో యమర్జన్సీ విధించినట్లు ఉన్నారు . నువ్వు కూడా అలానే తయారు అయ్యేలా ఉన్నావు . మేము మీ అత్త గారిని వాదించిన ఓటర్ లలాగా తయారు అవ్వాలి అర్జెంటు గా ….మరి మా బాగు మేమే చూసుకోవాలిగా .