Category Archives: Poems

Jayaho Jagan ..

వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్!
‘ఓదార్పు’ ను తెస్తున్నాయ్ !! అభయ హస్తమిస్తున్నాయ్!!!

తండ్రి అడుగుజాడల్లో – తనయుడు నడిచొస్తూంటే
చూడాలని పరితపించు – కళ్లను మురిపిస్తున్నాయ్!!!

దళిత వాడవాడల్లో – ముకుళిత హస్తాలనెత్తి
ఆత్మీయం గా ప్రజలను – అదిగొ పలకరిస్తున్నాయ్!!!

రాహు కేతువులు పట్టిన – రాష్ట్రానికి మళ్లీ యిక
మంచి రోజులొస్తాయని – ఆశలు చిగురిస్తున్నాయ్!!!

కదల లేని మెదల లేని – ముసలి రాజు రాజ్యానికి
చెదలు దులిపి చేవ నింపి – జవసత్వాలిస్తున్నాయ్!!!

వక్ర బుద్ధి గల ‘చంద్రుని ‘ – అక్రమాలు అసత్యాలు
పటాపంచలను చేస్తూ – పరుగులు తీసేస్తూన్నాయ్!!!

విధి రేపిన విషాదాన్ని – మది లోనే అదిమి పట్టి
పేదవాడి బాసట గా – నిలిచేందుకు వస్తున్నాయ్!!!

అదే రూపు,అదే నవ్వు – అవే హావభావాలు!
అడుగు తీసి అడుగేస్తే – అవిగొ విజయ రావాలు!!!

పులి కడుపున పుట్టిన – బెబ్బులి బిడ్డే ఈ జగన్!!!
ప్రత్యర్థుల గుండెల్లో – కోటి ఫిరంగులు మ్రోగున్!!!

(జయహో జగన్……నీ పర్యటన దిగ్విజయం కావాలని ఆశిస్తూ….)

8 Comments

Filed under Poems