Category Archives: Uncategorized

TDP కంచుకోటకు బీటలు

TDP కంచుకోటకు బీటలు! ఆంధ్రభూమి, July 23,2018
శ్రీకాకుళం: సరిగ్గా 2004 సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరాయి. అందులో టీడీపీ కంచుకోట, అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ జయాపజయాలు ఫిఫ్టీ-్ఫఫ్టీ కంటే బలహీనంగా ఉంటాయన్న సర్వేలు ఆ పార్టీ అధిష్ఠానానికి హైబీపీ తెప్పించింది.

ఉత్తరాంధ్రలో అధికార పార్టీ అపజయాలకు అద్దంపట్టే ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలు, వలసలు పెరిగిపోవడం, రైతాంగం సాగునీరులేక అల్లాడడం, నిరుద్యోగం, యువత నిరాశలో ఉండడం వంటివి టీడీపీకి పెనుగండంగా మారనున్నాయి.

రైల్వేజోన్ వస్తే ఉపాధి వచ్చేది, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ వస్తే పరిశ్రమలు వచ్చేవి… ఏవీ లేకపోవడంతో టీడీపీకి దెబ్బ తప్పదంటున్నారు.

2004లో కాంగ్రెస్‌కి ఈ జిల్లాలు ఇరవైకి పైగా అసెంబ్లీ సీట్లు ఇచ్చి పీఠం మీద కూర్చొపెట్టిన సీన్ రీపీట్ అవ్వడం ఖాయమంటూ రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సైకిల్‌కి ఎక్కడిక్కడ పంచర్లు పడ్డాయి… శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నం వరకూ అంతా రిపేర్లే అంటూ హెచ్చరికలను బాబు ప్రైవేటు సర్వేలు చెబుతునే ఉన్నాయి.

అధికార పార్టీ నాలుగేళ్ళ పాలన వ్యతిరేకతను బాగా పోగేసింది. చెప్పిన మాటలూ, ఇచ్చిన హామీలు ఈ జిల్లాల్లో సకాలంలో నెరవేర్చకపోవడంతో తిరుగుబాటు మొదలైందంటున్నారు.

బీసీలు, పేదలు ఎక్కువగా ఉన్న చోటనే అధికార పార్టీకి ప్రమాదఘంటికలు అంటూ రాజకీయ ప్రైవేట్ సర్వేలు సుస్పష్టంగా చెబుతున్నాయి. అందుకే, గత ఎన్నికల్లో లెక్కే మారుతుందన్న అనుమానాలు బాబులో కన్పిస్తున్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెప్పుకొస్తున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మిత్రపక్షం బీజేపీ ఒక సీటు కూడా కలుపుకుని పాతిక ఎమ్మెల్యేలను టీడీపీ ఖాతాలోకి చేరాయి. అలాగే, ఐదు ఎంపీ సీట్లులో నాలుగు సునాయాసంగా గెలుచుకుని, వైసీపీ నుంచి అరుకు ఎంపీ గీతను లాగేసి ఐదు ఎంపీలుగా తనవేనని టీడీపీ చెప్పింది. అలాగే, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని మొత్తంగా 29 ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర టీడీపీ బలంగా పేర్కొంది. అంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ ఉత్తరాంధ్రలో బలంగా ఉండాలి. కానీ, ఆ పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు.

ఈసారి ఉత్తరాంధ్రలో టీడీపీ భారీ షాక్ తగిలేలా ఉందని, పోయిన ఎన్నికల్లో ఎనభైశాతం పైగా సీట్లును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాపు, వెలమ, కళింగ వంటి బీసీలు బాగా ఉన్న ఈ జిల్లాల్లో టీడీపీ అంటే ముఖంచాటేసుకునేలా మారారు.
బాబు ముఖ్యమంత్రి కావడానికి మద్దతు ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు ఓటు మారిస్తేగాని మా రాత మారదన్న నిశ్చయానికి వచ్చారు.

ఇక్కడ ఐదుగురు మంత్రులు ఉన్నారు. అందరూ సీనియర్లు.. గండర గండర్లే! కానీ, తాజా రాజకీయ వాతావరణం మాత్రం వీరంతా డేంజర్ జోన్‌లో ఉన్నారంటూ సంకేతాలు వెలుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి ఓడిపోయేది ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి అని ఇంటెలిజెన్స్ నివేదికలు సుస్పష్టం చేస్తున్నాయి. సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తూన్న కళా పనితీరు కూడా ఆయన ఓటమి అంచున నిలబెట్టాయని అంటున్నారు.

ఇక మరో మంత్రి అచ్చెన్నాయుడు పెద్దగళాన్ని విస్తారంగా విప్పేసి విపక్షాలపై విరుచుకుపడే నైజం ఆయనను రాష్ట్రంలోనే ఇమేజ్ పెంచింది. కానీ, టెక్కలి ఓటర్లు ఆయనను వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే బయటపడుతుందంటున్నారు. ఈయనకు సరైన ప్రత్యర్థిని వైసీపీ వెతుకుతోంది. మాజీ కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి వంటి నేత అచ్చెన్నపై పోటీకి దిగితే ఆయన గెలుపు కూడా కష్టమేనంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు బాబువద్దకు చేరాయి.

విజయనగరం జిల్లాలో ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణరంగారావుకి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆ జిల్లా అంతటా వైసీపీ స్వీప్‌గా విజయాన్ని సాధిస్తుందన్న సంకేతాలైతే ప్రజల నుంచి వున్నాయి. ఇక్కడ మంత్రి ఫిరాయింపే ఆయనకు పెద్ద మైనస్.

విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మంత్రుల తీరూ అలాగే ఉంది. అయ్యన్నపాత్రుడు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. అందుకే, ఆయన బరిలోకి దిగరన్నది పబ్లిక్ టాక్.

మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన భీమిలి అసెంబ్లీలో విజయం దక్కదన్నది సర్వేలు తేల్చిచెప్పేశాయి.

ఇలా… ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదుగురు మంత్రులకూ విజయం తథ్యమన్న ధీమా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని గెలుస్తామన్న అంచనాల్లో బాబు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో పంద్రాగస్టు పండుగ వేదికగా శ్రీకాకుళాన్ని ఎంచుకుని ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ విజయానికి కావల్సిన రిపేర్లు చేసేందుకు కసరత్తు ప్రారంభిస్తారన్నది సీఎంవో కార్యాలయం నుంచి అందిన సమాచారం!

Advertisements

11 Comments

Filed under Uncategorized

కొత్తగా ఈ ‘1500 రోజుల పండగ’ ఏంది బాబూ!

ఈ ఏడాది జూన్ నెలలోనే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పునరంకిత దీక్షలు..సభల పేరుతో కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు. మళ్ళీ దీని కోసం పత్రికలు, టీవీల ప్రకటనలపై పెట్టిన ఖర్చు కూడా కోట్లలోనే. ఎవరైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలి వంద రోజులు…ఏడాది పూర్తయిన తర్వాత వార్షికోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. ఇది ఏ పార్టీ ఉన్నా చేస్తూనే ఉంటుంది. గత నెలలోనే తెలుగుదేశం సర్కారు నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. అందుకే పునరంకిత సభలు..కార్యక్రమాలు అంటూ ప్రజాధనంతో వారం రోజుల పాటు హంగామా చేసింది. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను విస్మరించి…జూన్ 2 నుంచి 8 వరకూ ఇలా కార్యక్రమాలు చేయటం ఏమిటి అనే విమర్శలు ఉన్నా…చంద్రబాబు వాటినేమి పెద్దగా పట్టించుకోవటం లేదు.

కానీ ఇఫ్పుడు కొత్తగా ‘1500 రోజుల ప్రగతి’ పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి పండగ చేసుకుంటున్నారు. జూన్ లోనే వారం రోజుల పాటు ఈ నాలుగేళ్లలో తానేమి చేసింది చంద్రబాబు ప్రజలకు వారం రోజుల పాటు ‘చెవుల్లో తుప్పు వదిలేలా’ విన్పించేశారు. ఇది జరిగిన 40 రోజుల్లోనే కొత్తగా చెప్పటానికి చంద్రబాబు సాధించింది ఏమిటి?. అంటే ఏమీ లేదు.

చంద్రబాబుకు ప్రచారం చేసుకోవటానికి..ప్రజల డబ్బుతో పేజీలకు పేజీలు యాడ్స్ ఇవ్వటానికి ఓ కారణం కావాలి. అంతే…అదే 1500 రోజుల పండగ. ఓ వైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా..బ్రిడ్జిలు లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా పట్టించుకోని చంద్రబాబు ఏదో కార్యక్రమం వెతుక్కుని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంగా కారణంగా ఏ ప్రమాదంలో ఎవరు చనిపోయినా ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవటం తప్ప…శాశ్వత నివారణ చర్యలు శూన్యం. గత కొంత కాలంగా ఏపీలో జరుగుతున్న పడవ ప్రమాదాలే దీనికి ఓ ఉదాహరణ. ఇందులో సర్కారు నిర్లక్ష్య ధోరణి, కొంత మంది నేతల డబ్బు కక్కుర్తి..అధికారుల అలసత్వం కలసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఓ వైపు గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతైన పిల్లల ఆచూకి తెలియక ఆ తల్లిదండ్రుల ఆందోళన అలాగే కొనసాగుతుండగానే…చంద్రబాబు మాత్రం ఇలా ప్రజల సొమ్ముతో ‘పండగలు’ చేసుకుంటున్నారు.

http://telugugateway.com/2018/07/chandrababu-new-trend-1500-days-festival/

8 Comments

Filed under Uncategorized

రుమలలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన రమణ దీక్షితులు

తిరుమలలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన రమణ దీక్షితులు
(మొన్న దుర్గగుడిలో క్షుద్ర పూజలు జరిగాయి , 1995 నుంచి 2014 వరకు బాబు CM గా ఉన్నారు
దుర్గగుడిలో క్షుద్రపూజలు..టీటీడీ పోటులో తవ్వకాలు!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాల్లో అసలు ఏమి జరుగుతోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రధాన దేవాలయాలు అన్నీ ఎందుకు వివాదాల్లో చిక్కు కుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయవాడలో కనకదుర్గ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అక్కడ తప్పు జరిగినట్లు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా తేల్చింది. కానీ తప్పు చేసిన వారిపై చర్యలు కరవు.

దేవాలయానికి ఏ మాత్రం సంబంధంలేని వారు అర్థరాత్రి గుడిలోకి ప్రవేశించి ఎలా పూజలు చేస్తారు..అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా ‘రాజకీయ ప్రయోజనాల’ కోసం చేశారనే విమర్శలూ వెల్లువెత్తాయి. దుర్గగుడిలో అర్థరాత్రి పూట జరిగిన క్షుద్రపూజలకు సంబంధించిన వ్యవహారం సీసీటీవీల్లో కూడా రికార్డు అయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భక్తులను మనోవేధనకు గురిచేసేవే. తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు తయారుచేసే పోటులో ‘ఆభరణాల’ కోసం అని తవ్వకాలు జరిపారంటూ దేవాలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈవోకు కూడా తెలియకుండా పోటులో తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని రమణదీక్షితుల ప్రశ్న.

అంతే కాదు…భక్తులు అందజేసే విలువైన బంగారు కానుకల్లో కొన్నింటిని కరిగించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది అన్నది టీటీడీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఆభరణాల గల్లంతు అవుతున్నాయని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న టీటీడీ వ్యవహారం ఇప్పుడు భక్తుల్లో ఆందోళన రేపుతోంది)

రమణదీక్షితులు గారు చెప్పిన విషయాలు …..
స్వామి వారి ఆభరణాల గురించి పూర్తిగా తెలిసిన నలుగురు ప్రధాన అర్చకులను తొలగిస్తే ఇక అడిగే వారే ఉండరన్న ఉద్దేశంతోనే తమను హఠాత్తుగా తొలగించారని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యానించారు.

1996లో మిరాశీ వ్యవస్థ రద్దు అయిన తర్వాత ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. అప్పటి నుంచి లెక్కలేకుండా పోయిందన్నారు. 1996 తర్వాత ఎన్ని వజ్రావైడుర్యాలు మాయమైపోయాయో చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు.

ఇటీవల శ్రీవారి పోటును మరమ్మతుల పేరుతో 25 రోజుల పాటు మూసివేశారని రమణదీక్షితులు ఆవేదన చెందారు. పోటు మరమ్మతు పేరుతో తవ్వకాలు జరిపారన్నారు. మరమ్మతుల కోసం వంటశాలను తవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిధుల కోసం తవ్వారా లేక నేలమాళిగల కోసం తవ్వకాలు జరిపారా అన్నది తేలాలన్నారు. ఈ తవ్వకాల విషయం ఈవోకు కూడా చెప్పకుండా ఎందుకు చేశారని నిలదీశారు.

మైసూర్‌ మహారాజు ఇచ్చిన వందల కోట్ల విలువైన వజ్రం మాయమైపోతే పట్టించుకున్న వారే లేరన్నారు. ఇటీవల అది జెనివాలో వేలానికి వచ్చిందని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలను మీడియా సమావేశంలో చూపించారు. భక్తులు విసిరిన నాణాలకు వజ్రం ఎలా పగిలిపోతుందని రమణదీక్షితులు ప్రశ్నించారు.

ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ప్రకారమే మాయమైన పింక్ డైమండ్ ఖరీదు కొన్ని వందల కోట్లు అని రమణదీక్షితులు సదరు రిపోర్టులను చూపించారు. 2001 నాడు గరుడసేవలో మాయమైన పింక్‌ వజ్రం దేశం దాటిపోయిందన్న మాటకు తాను కట్టుబడే ఉన్నానన్నారు. మాయమైన వజ్రం చిన్నసైజుదేమీ కాదని.. ఒకవేళ నిజంగా పగిలిపోయి ఉంటే దాని ముక్కలైనా చూపించాలన్నారు.

న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి వజ్రాల గురించి ఏం తెలుస్తుందని రమణదీక్షితులు ప్రశ్నించారు. వజ్రాల సంగతి తేలాలంటే వజ్రాల నిపుణులతోనే విచారణ జరిపించాలన్నారు. శ్రీవారికి మహారాజులు సమర్పించిన విలువైన పాత నగలు అలంకరణకు ఎందుకు రావడం లేదని రమణదీక్షితులు ప్రశ్నించారు.

మాయమైపోయిన వజ్రాలు, ఆభరణాలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చర్యల వల్ల స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని రమణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వామివారి తేజస్సు తగ్గిపోతే భక్తులకు అనుగ్రహం లభించదన్నారు. స్వామి వారి వద్ద ఇనుప వస్తువులు వాడకూడదని.. కానీ వాటినే వాడుతున్నారన్ని రమణదీక్షితులు చెప్పారు. ఇనుముకు ఉన్న అయస్కాంత శక్తి వల్ల స్వామివారి తేజస్సు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఎంతో మంది అధికారులకు తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

వెయ్యికాళ్ల మండపం తొలగించివద్దని చాలా సార్లు చెప్పానన్నారు. కనీసం మరొక చోటైనా అదే రీతిలో నిర్మించాలని కోరానన్నారు. కానీ వినకుండా తొలగించారన్నారు. చివరకు స్వామివారికి రథమండపం కూడా లేకుండా చేశారన్నారు. ప్రతి ఆలయానికి రథమండపం ఉందని.. ఒక్క తిరుమలేశుడికి మాత్రమే రథమండపం లేకుండా చేశారన్నారు. కొండపై జరిగిన అన్ని విషయాలపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్ని బయటకు వస్తాయని రమణదీక్షితులు అభిప్రాయపడ్డారు. స్వామిసన్నిధిలోనే తాము నిస్సాహాయులుగా ఉండిపోవాల్సి వచ్చిందని… అందుకే ఆలయ రక్షణ కోసం మీడియా ముందుకు, భక్తుల ముందుకు రావాల్సి వచ్చిందన్నారు.

40 Comments

Filed under Uncategorized

బాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది ?

40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై విమర్శలకు తానే అవకాశం కల్పిస్తున్నరా?. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.
దేశంలో అందరి కంటే తానే సీనియర్ అని..తనను మించిన సీనియర్ ఎవరూలేరని చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. మరి అంత సీనియర్ అయితే ఎలా ఉండాలి. ఏపీని ఎలా పరుగులు పెట్టించాలి. కానీ చేస్తున్నది ఏమిటి?

తన సీనియారిటీని రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా…స్కీమ్ స్కీమ్ లోనూ స్కాం చేసి..వందల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్నదానికే ఉపయోగిస్తున్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆయన సీనియారిటీ ఎలా ఫెయిలయిందో ఓ సారి చూడండి.

1.టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావటానికి ఏడాది ముందు నుంచే ప్రధాని మోడీ చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏమి జరుగుతుందో అప్పుడు ఆయనకు తెలియదా?. ఆ మాత్రం స్మెల్ చేయలేకపోయారా?.

2.ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడే అందులో విభజన చట్టంలో ఉన్నవే తప్ప..కొత్తగా ఏమీలేవని అందరూ గగ్గోలు పెట్టారు. ఎంతో సీనియర్ అయిన..ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్న చంద్రబాబు ఎందుకు ప్యాకేజీలో ఏమీలేవని ఎందుకు అంచనాకు రాలేకపోయారు?. చట్టబద్దత అంటూ హడావుడి చేసి చివరకు వెనక్కితగ్గారు?

3.అంత సీనియర్ చంద్రబాబుకు ప్రత్యేక హోదాతో ఏమి వస్తాయో తెలియదా?. ఎవరైనా నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా సాధించిన రాష్ట్రాలు ఏమి సాధించాయి అని అసెంబ్లీ సాక్షిగా ఎలా అనగలిగారు. ఇప్పుడు అదే హోదా వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఎవరూ ఎడ్యుకేట్ చేయకుండానే ఎలా ఎడ్యుకేట్ అయ్యారో?.

4.పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు రాజధాని అమరావతి డిజైన్లకు మూడేళ్ళ సమయం తీసుకుంటారా?. ఇది వ్యూహాత్మక ఎత్తగడ కాక ఇంకా ఏమైనా ఉందా?. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించే ఈ కాలంలో డిజైన్లకు మూడేళ్ళ కాలం తీసుకోవటంలో చంద్రబాబు సీనియారిటీ తేలిపోయిందా?

5.నాలుగేళ్లు సఖ్యతతో ఉండి సాధిస్తానని…తనను నమ్మాలని ఏపీ ప్రజలను కోరిన చంద్రబాబు…ఇప్పుడు పోరాటం తప్ప..మరో మార్గం లేదని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. మోడీ మట్టి..నీళ్ళు ఇచ్చినప్పుడే చంద్రబాబు లాంటి సీనియర్ కు అసలు విషయం అర్థం కాలేదా?. అప్పుడు ప్రజలందరూ తిట్టినా..సంతోషంగా వాటిని తీసుకున్నది చంద్రబాబే కదా?.

6జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కాంట్రాక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేతికి తెచ్చుకోవటానికి చంద్రబాబు తన సీనియారిటీని ఉపయోగించుకున్నారా?

7.నాలుగేళ్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఏమీ సాధించలేని చంద్రబాబు లాంటి సీనియర్ ఇప్పుడు పోరాడి సాధించగలరా?. పోరాడటానికి ఏపీలో బిజెపికి ఉన్న బలం ఎంత?. బలగం ఎంత?.

8.545 ఎంపీ సీట్లు ఉన్న దేశంలో ఇప్పుడు తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే చాలు…తానే ప్రధానిని డిసైడ్ చేస్తాడట. అంటే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తాయా?. మిగిలిన పార్టీలకు సీట్లు రావా…వాళ్లకు చంద్రబాబులా ఏజెండాలు ఉండవా?.

9.ఎన్నికలకు ముందు తన అనుభవంతో రైతు రుణమాఫీతోపాటు..రాజధాని కూడా అద్భుతంగా కడతానని ప్రజలను నమ్మించి…రైతు రుణమాఫీలో అడ్డంగా కోతలు పెట్టడానికి ఉపయోగించుకున్నారా తన సీనియారిటీని?

10.చంద్రబాబు ప్రస్తుతం తన సీనియారిటీని కేబినెట్ లో అక్రమాలను సక్రమం ఎలా చేసుకోవాలా?. అధికారులు వద్దన్నా ఎలా ముందుకు వెళ్ళాలా అనే పనికే వాడుతున్నారు.

Source-Telugu Gateway

39 Comments

Filed under Uncategorized

హెరిటేజ్ భూకుంభకోణం

అమరావతి లో హెరిటేజ్ భూకుంభకోణం -సాక్షి పరిశోధన
బాబు CM అయిన నెల రోజులకు అమరావతి ప్రాంతం కంతేరు లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను ఒక కోటి 23 లక్షల 76 వేలకు కొన్నది అంటే సగటున ఎకరం 8 లక్షల 70 వేలకు కొన్నది, కంపెనీ కొనుగోలు చేయగానే ఆ భూమి ఎదుట రాజధాని ప్రకటన వచ్చింది.చుట్టు పక్కల గ్రామాల భూములు రాజధాని పూలింగ్‌లోకి వెళ్లినా… చెక్కు చెదరకుండా కంపెనీకే మిగిలింది.

(హెరిటేజ్ పేరు మీద 14 ఎకరాలు కొన్నవాళ్ళు బినామీల పేరుతొ ఎన్ని వేల ఎకరాలు కొని ఉంటారో?)

పూలింగ్‌ నుంచి మినహాయింపు
రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్‌ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్‌ ప్రక్రియలో చేర్చనే లేదు.

మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు తీసుకున్నారు. కానీ, నిడమర్రును ఆనుకునే ఉన్న కంతేరు ల్యాండ్‌ పూలింగ్‌లో లేకపోవడం గమనార్హం. చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ పుడ్స్‌ కొనుగోలు చేసిన భూములతోపాటు, ఆయన సన్నిహిత సంస్థ లింగమనేని (చౌదరి)ఎస్టేట్స్‌కు చెందిన వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి. అమాంతం ధరలు పెరిగిన ఆ భూములన్నీ హెరిటేజ్, లింగమనేని ఎస్టేట్‌ గుప్పిట్లోనే ఉండేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.తరువాత ఎకరం ధర 3 -5 కోట్లకు పెరిగింది.

హెరిటేజ్, లింగమనేని సంస్థలకు రూ.వేల కోట్ల లబ్ధి.

ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించడం గమనార్హం.

[2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం.

2014, సెప్టెంబరు 8న హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్‌ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు విక్రయించారు.

2014, సెప్టెంబరు 8న హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం.]

రాజధానిపై తప్పుదోవ పట్టించి మరీ..
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా తాడికొండ, మంగ ళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు తెరతీశారు. అందులో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని ప్రచారంలోకి తెచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు.

ఆ తర్వాత సీన్‌ పూర్తిగా మార్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్‌ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్‌ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్‌ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు.

-సాక్షి
===================================
Note: బాబు నివాసముంటున్న అక్రమ కట్టడం బాబు బినామీ లింగమనేని చౌదరి దే.

అమరావతి రాజధాని కుంభకోణం దేశం లోనే అతి పెద్ద భూ కుంభకోణము- రిటైర్డ్ IAS EAS శర్మ

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం
ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయింది
రాజధాని ముసుగులో సర్కారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించడం తప్పుడు విధానం
సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనను సర్వీసులో ఉండగానే తప్పుపట్టాను
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం

అమరావతి ఎంపికలో ఒక జాతి ప్రయోజనాలు అవినీతి , రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి,
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి IYR కృష్ణ రావు

కమ్మ కులస్థుల లబ్ది కోసమే అమరావతి ఎంపిక జరిగింది
శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూరు లో రాజధాని వద్దు అని చెప్పినా అక్కడ పెట్టడానికి కారణం అయన కులస్థులు అక్కడ ఎక్కువగా ఉండడమే-టైమ్స్ అఫ్ ఇండియా
[Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18,2014, Times Of India.
[It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

బాబు ఏది చేసిన అవినీతి, కుల ప్రయోజనాలు ఉంటాయి
-లండన్ రీసెర్చ్ స్కాలర్ Dalel Benbabaali

27 Comments

Filed under Uncategorized

చంద్రబాబు గ్రాఫ్ నేలచూపులు

చంద్రబాబు గ్రాఫ్ నేలచూపులు
గత ఎన్నికల నాటి ఓటు బ్యాంకులో భారీ కోత
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘గ్రాఫ్’ శరవేగంగా పడిపోతుందా?. అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు సైతం.

గత నెల రోజుల వరకూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తామనే ధీమా టీడీపీ నేతలు..పార్టీ శ్రేణుల్లో ఉండేది. కానీ ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

‘ప్రత్యేక హోదా’ విషయంలో చంద్రబాబు నాలుగేళ్ల పాటు రకరకాల మాటలు మార్చి…చివరి నిమిషంలో మళ్లీ ‘ప్రత్యేక హోదా’ అందుకున్న తీరు చూసి ఏపీ ప్రజల్లో..ముఖ్యంగా తటస్థులను తీవ్ర అసంతృప్తిని గురిచేసింది. చాలా మంది ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు కూడా.

దీని కంటే అత్యంత కీలకమైన అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరిగ్గా నెల రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అంతే కాదు..అప్పటివరకూ చంద్రబాబును సమర్థిస్తూ వచ్చిన పవన్ తీరును తప్పుపట్టిన వారిలో చాలా మంది ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన వైపు మారిపోయారు.

గత ఎన్నికల్లో కేవలం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మద్దతు ఇచ్చానని..కానీ ఆయన అనుభవం ఏ మాత్రం పనిచేయలేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ తనకు కులాలు..మతాలు..ప్రాంతాల పట్ల పట్టింపులేదని..తాను అందరివాడినని చెబుతున్నారు. ఆయన ఏమి అనుకుంటున్నా ఏపీలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా ప్రస్తుతం పవన్ వైపునకు పూర్తిగా మారిందని టీడీపీ నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా చంద్రబాబుకే మద్దతు ప్రకటించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఉపయోగపడిన 10 శాతం ఓటు బ్యాంకు నికరంగా దూరం అయినట్లే.

ఏపీ మొత్తంలో కాపు సామాజిక వర్గం జనాభా 12 నుంచి 14 శాతం వరకూ ఉంటుందని అంచనా. దీనికితోడు గత ఎన్నికల్లో చంద్రబాబుకు అప్పట్లో మోడీపై ఉన్న ఇమేజ్ చాలా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఏపీలో ప్రధాని మోడీ ఇమేజ్ ఏమీలేకపోయినా గత ఎన్నికల్లో కలిసొచ్చిన ఈ ఓటు బ్యాంకు చంద్రబాబుకు దూరమైనట్లే.

అయితే గత ఎన్నికల్లో తాము సొంతంగానే గెలిచామని చంద్రబాబు..టీడీపీ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నా అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసిందే. అంటే ఈ లెక్కన చంద్రబాబుకు గత ఎన్నికల్లో సహకరించిన సామాజిక వర్గాలపరంగా ఉన్న 10 శాతం పైగా ఓటు బ్యాంకు దూరమైనట్లే.

గత ఎన్నికల్లో చంద్రబాబు అత్తెసరు ఓట్ల తేడాతోనే అధికారం దక్కించుకున్నారు. దీనికి తోడు రాజధాని అమరావతిలో కాంట్రాక్ట్ ల దోపిడీ తప్ప..రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడకపోవటం…ఏపీలో పెచ్చరిల్లిన ప్రభుత్వ అవినీతి మరికొంత నష్టం చేయటం ఖాయం.

ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు రాబోయేది అత్యంత గడ్డుకాలమే అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

http://telugugateway.com/2018/04/chandrababu-graph-down-fastly-in-andhra-pradesh/

Leave a comment

Filed under Uncategorized

అవకాశవాదానికి పోతే ఇంతే బాబూ!

రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చంద్రబాబును ఒంటరిపాటు చేస్తున్నాయి. అపర చాణక్యుడిగా నాలుగేళ్లపాటు కీర్తింపబడిన చంద్రబాబు ప్రస్తుతం తత్తరపడి పోతున్నారని సొంత పార్టీ వారే అంటున్నారు. చంద్రబాబు బిత్తర చూపులు అర్థమయి తెలుగు తమ్ముళ్లు పక్క చూపులు చూస్తున్నారని, రాజకీయ వలసలు తెలుగు దేశంలో జోరందుకోబోతున్నాయని అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే భవిష్యత్‌ రాజకీయ చిత్రపటం చంద్రబాబుకు అనుకూలంగా లేదన్న వాదనలకు బలం చేకూరుతున్నది.

ఈ పరిస్థితికి చంద్రబాబు అనుసరించిన అవకాశవాద వైఖరే ప్రధాన కారణం. మూడేళ్ళ కిందటే ప్రత్యేక హోదా రాదని తేలిపోయినా, ఈ నాలుగేళ్ళు బిజెపితో అంట కాగడం ఆయన చేసిన పెద్ద తప్పు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తుంటే … హోదా సంజీవని కాదు, హోదా కంటే మెరుగైన నిధులు, ఫలితాలు సాధిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు.

హోదా ఇవ్వలేమని కేంద్ర పెద్దలు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పలుమార్లు ప్రకటనలు చేసినా బాబుగారు అస్త్ర సన్యాసం చేసి జీహుజూర్‌ అంటూ కేంద్రానికి వంత పాడటం మరో తప్పు. ప్రత్యేక హోదాను అడిగిన వామపక్షాలపై, ప్రధాన ప్రతిపక్షంపై నిర్భంద కాండను యథేచ్ఛగా చంద్రబాబు సాగించడం మరో తీవ్ర తప్పిదం.

రాష్ట్రంలో ప్రతిపక్షాలనేవే లేవని తానే సర్వాంతర్యామి అన్నట్టుగా, తనను ప్రశ్నించే వారి పట్ల అమానుషంగా వ్యవహరించారు.

తెలుగుదేశం లోని ఇతర నేతలను సైతం అధికారులు లెక్క చేయటం లేదు. చంద్రబాబు, చినబాబుల ‘హవా’ తప్ప మరొకరి మాట చెల్లుబాటు కాలేదు. జిల్లాలలో మంత్రులు, ఎంఎల్‌ఏల మాటకు అధికారుల వద్ద విలువ లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది.
తాను మారిన మనిషినని పదే పదే చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మారకపోగా మరింత చాదస్తంగా తయారయ్యారని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు అనేకసార్లు వ్యాఖ్యానించారు. చెప్పిందే చెప్పుకోవటం, గంటల తరబడి మాట్లాడటం, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు అంటూ ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్‌ దాకా పనులు విడిచి కాలయాపనలు చేయటం ఈ కాలంలో పరిపాటి అయింది.

అభివృద్ధి పేర రాష్ట్రంలో మాయా ప్రపంచాన్ని సృష్టించాలను కున్నారు చంద్రబాబు. అందుకోసం మీడియా, సోషల్‌ మీడియాను వేదిక చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని ఈవెంట్లుగా మార్చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు, రాజకీయ వేదికలు ఏవైనా చంద్రబాబు భజన పరిపాటి అయిపోయింది.

రాష్ట్రంలో 1000కి పైగా పరిశ్రమలు, 10 లక్షల మందికి ఉపాధి, నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని బాబుగారు పదే, పదే చెప్పేవారు. ప్రపంచ రాజధానులను తలపించే రాజధాని నిర్మాణం చేస్తున్నానని నిత్యం హంగామా చేసేవారు! రైతాంగం గురించి కానీ, వ్యవసాయ కూలీలు, భూములు కోల్పోతున్న ప్రజలు, కనీస వేతనం పెరుగుదలకై వేచి ఉన్న కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకున్న పాపానపోలేదు.

-ప్రజాశక్తి , Apr 10, 2018

2 Comments

Filed under Uncategorized