Category Archives: Updates

Law et al. News : SC defers Jaganmohan Reddy’s bail plea hearing to Sep 28

Law et al. News : SC defers Jaganmohan Reddy’s bail plea hearing to Sep 28.

11 Comments

Filed under Updates

మానవత్వమే నా కులం:జగన్

అనంతపురం: మానవత్వమే తన కులం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన రాయదుర్గం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేపదే తన కులం, మతం గురించి మాట్లాడుతున్నారని, మానవత్వమే తన కులం అని, పేదలకు మెరుగైన సేవలు అందించాలన్న తపనే తన మతం అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవాకు 4వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. ఆయన మరణం తరువాత హంద్రీనీవాకు వంద కోట్ల రూపాయలు కూడా వెచ్చించలేదన్నారు.

స్వర్ణయుగం వస్తుందని, అప్పుడు ఎలా బతకాలో ఆలోచించాల్సిన అవసరం అక్కాచెల్లెళ్లకు ఉండదన్నారు. బడికి వెళ్లే విద్యార్థులందరికీ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతామన్నారు. వృద్ధుల పింఛను 200 రూపాయల నుంచి 700 రూపాయలకు పెంచుతామని చెప్పారు.

బోయ, కురుబ కులస్తుల స్థితిగతులు తనకు తెలుసన్నారు. అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు కులస్తులకు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వాల్మికులను ఎస్టి జాబితాలో చేర్చేందుకు కృషిచేస్తామని, సువర్ణయుగం వస్తే కేంద్రానికి తీర్మానం పంపుతామని చెప్పారు.

107 Comments

Filed under Updates

Notice to Deccan Chronicle for baseless news article on Jagan

Folks,

Mr.Satish Joint Managing Partner of the Partnership firm M/s Y.Mahabaleswarappa & sons, or YMS mines, is shocked and taken aback that publication by Deccan Chronicle dares to state as if it knows what he spoke before the CBI and more so, claiming to know of his having given a written statement of he being threatened by Mr.Y.S.Jagan Mohan Reddy at gun point in relation to his mining business.
Mr.Satish categorically states that he had no interaction with Mr.Y.S.Jagan Mohan Reddy in relation to his mining business. He once again categorically denies these false and untrue impugned publications that Mr.Jagan Mohan Reddy interfered in his business activities and exerted pressure and threats, and that too at gun point. He flatly denies all the reports published in Deccan Chronicle yesterday.
Mr.Satish also stated that these publications are highly mischievous in nature, created by vested interests that apparently seem to have some personal scores to settle with who, they are mainly targeting (i.e. Mr.Jagan Mohan Reddy) and in the process are trying to use him as sacrificial lamb.

85 Comments

Filed under Updates

When the hunter becomes the hunted

చంద్రబాబును విచారించండి: వైఎస్ జగన్

హైదరాబాద్ : ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజును బదిలీ చేశారన్నారు.

అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు.

ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత తనను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందంటే… ఇందులో తనకు సంబంధం లేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా సాక్షిగానే విచారించిందన్నారు.

చంద్రబాబునాయుడు… ఆయనతో కుమ్మక్కైన ఎల్లో మీడియా …. ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొంతకాలం కిందట వారితో జత కలిసిన టీవీ9 వీరందరికీ నేను చెప్పేది ఒక్కటే. జర్నలిస్ట్ నీతిని పాటించండి. మీరు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముందో బయటకు చెప్పండి అని అన్నారు. ఆయన క్లుప్తంగా మాట్లాడిన మాటల్లో ఎక్కడ తొట్రుపాటు కనిపించలేదు. జగన్ వెంట ఎంపీ రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, టి బాలరాజు తదితరులు ఉన్నారు.

28 Comments

Filed under Updates

2424 Page PIL on Babu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తిగా అద్దం అని ఆమె తెలిపారు. దేశవిదేశాలలో చంద్రబాబు పేరన ఉన్న ఆస్తుల వివరాలు, బీనామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు అందులో తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు పేర్కొన్నారు. అతని ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.

18 అంశాలలో చంద్రబాదు అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ పేర్ల మీద పెట్టిన అక్రమ ఆస్తుల వివరాలు తెలిపారు. చివరకు తల్లి పేరుతో కూడా ఆయన సాగించిన అక్రమాల వివరాలను వెల్లడించారు. సింగపూర్లో బీనామీ పేరు మీద కొనుగోలు చేసిన హొటల్ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. చంద్రబాబు బీనామీలుగా వ్యవహరిస్తూ సుజనా చౌదరి, సిఎం రమేష్ విదేశాల నుంచి తరలించిన నిధుల వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లెలో చంద్రబాబుకు చెందిన వ్యవసాయ భూముల వివరాలు అన్నింటినీ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు అనేక అక్రమ మార్గాలలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన తీరుని వివరించారు.

16 Comments

Filed under Updates