ఇంగ్లీష్ పత్రిక జర్నలిస్ట్ అభిప్రాయసేకరణ

గుంటూరులో డిసెంబర్ 31 నుంచి జనవరి 8 వరకు ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు పాలేకర్ శిక్షణ సదస్సు జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి సగటున 500 మందికి తక్కువకాకుండా రైతులు, అధికారులు, ఎన్జీవోలు, మొత్తం 8 వేలకు పైగా ప్రతినిధులు వచ్చారు. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసి లాభాలు ఆర్జించేవిధంగా వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సదస్సుకు చంద్రబాబుతోబాటు మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, విదేశీ రాయబారులు సైతం వచ్చి, పాలేకర్ చేస్తున్న కృషిని కొనియాడారు.

శిక్షణకు వచ్చిన రైతులకు ఇక్కడే టెంట్లు వేసి, భోజన వసతి సౌకర్యం కల్పించారు. శిక్షణ శిబిరంలో జిల్లాలవారిగా బారికేడ్లు వేసి, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అంటే 13 జిల్లాలనుంచి ఇక్కడ జనం పొగయ్యారన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇక్కడే చూడొచ్చన్నామాట.

ఈ సందర్భంగా ఈ శిక్షణకు వచ్చిన ఓ జర్నలిస్టు ఈ వారం రోజులు ఇక్కడే ఉండి, అన్నీజిల్లాలవారిని వంతులవారిగా కలసి వారి అభిప్రాయాన్ని, ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలు , వాటిమీద రైతులు, యువకుల అభిప్రాయం తీసుకున్నారు. రోజుకు కనీసం 70-80 మంది చొప్పున దాదాపు 500 తో మాట్లాడి ఆ జర్నలిస్టు పలు విషయాలను నోట్ చేసుకున్నాడు. అవి ఏమిటంటే .

* చంద్రబాబు మాయలు చేయడం తప్ప ప్రాక్టికల్ గా ఏం చేయడం లేదు.

* రాజధాని, అమరావతి, కంపెనీలు ప్రాజెక్టులు, లక్షల్లో ఉజ్జోగాలు అంటూ అబద్ధాలు చెప్తున్నాడు తప్ప అవేం ఇంప్లీమెంట్ కావడం లేదు.

* అవినీతి, రౌడీయిజం పెచ్చుమీరింది. అధికారులు, పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు తప్ప ఏం చర్యడం లేదు.

* కేవలం మీడియా మెనేజిమెంటుతో బాబు నెట్టుకొస్తున్నడు. వాస్తవంలో అంత మోసం దగా

* హైదరాబాదు మీద పదేళ్ల హక్కులను తన ఓటు నోటు కేసుకోసం వదిలేసాడు.

అమరావతి, పోలవరం ఈరెండు దేశంలోనే ఇంతవరకు జరగని అతి పెద్ద అవినీతికి మూలాలు. ఇవి చంద్రబాబు ఎిప్పటికి పూర్తికావు.

* వచ్చే ఎన్నికలకు బాబు ఓటుకు పది వేలు అయినా ఇస్తాడు. పవన్ ను కొంటాడు. అరాచకాలు మీడియాతో మాయ చేస్తాడు.

* మరో పాతికేళ్లపాటు బాబు సీఎంగా ఉన్నా రాష్టానికి పైసా లాభం ఉండదు. బాబు ఎప్పుడూ తన సిందికెట్లకు, తన లాభం కోసం పని చేస్తాడు తప్ప రాష్ట్రం కోసం చేయడు.

* గెలుపు, అధికారం కోసం బాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడు. ఆయనకు విలువలు లేవు .

ముఖ్యంగా . గుంటూరు, కృష్ణ, చిత్తూరు రైతులు కూడా బాబు మీద అసంతృప్తిగానే ఉన్నారు . బాబు వల్ల పెద్దగా సమాజానికి లాభం లేదని అంటున్నారు.

జగన్ కు ఓసారి అధికారం వస్తే ఎలాఉంటుందో చూడాలి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది

◆◆◆◆◆◆◆◆◆◆

జగన్ గురించి ఏమన్నారంటే

★ జగన్ ఇంకా రాటు దేలాలి

★ గెలుపుకోసం ప్రాక్టికల్ గా ఆలోచించాలి.

★ మీటింగులకు వచ్చిన జనాలు ఓటు వేయడానికి రావడం లేదన్న విషయం గుర్తించాలి. బూత్ మేనేజిమెంట్ చేయడం రావాలి.

★ నంద్యాలలో గెలుపు ముంగిట నిలబడి, అంతలోనే ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవాలి.

★ బాబును ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అన్న విషయం గుర్తించి పనిచేస్తే తప్పక ఫలితం సాధిస్తాడు.

★ ఓటు బ్యాంకును ఓట్లుగా మారిస్తే చాలు . అదొక్కటే ఈయనకు హార్డిల్ అనిపిస్తోంది.

◆◆◆◆◆◆◆◆◆◆
పవన్ గురించి ఏమన్నారంటే

● తన శక్తిని గురించి ఎక్కువ ఊహించుకుంటున్నాడు
● ఈసారి కూడా బాబుకు అమ్ముడయ్యేందుకు రెడీగా ఉన్నాడు.
● పార్టీ పెట్టకముందే దానిమిద వ్యాపారం చేస్తున్నాడు.
● వచ్చే ఎన్నికల్లో ఈయనకు అంతగా ప్రజా మద్దతు ఉండదు.

49 Comments

Filed under Uncategorized

అనుభవం నీడలో ‘బాబు’ వైఫల్యాలు

అనుభవం నీడలో ‘బాబు’ వైఫల్యాలు
ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్ని గంపగుత్తగా ఒకటో, రెండో కులాలకు పందేరం చేయకుండా అందరికీ సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది?

కాపులకు 5% రిజర్వేషన్లు అందించే అంశంలో జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ నివేదిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించక ముందే.. కమిషన్‌లో మెంబర్‌ సెక్రటరీగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా దొడ్డిదారిన నివేదికను తెప్పించుకొని.. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన తీరు బాబు రాజకీయ ఎత్తుగడగానే కనిపించింది తప్ప కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి గోచరించలేదు. పైగా, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కేంద్రానికి ఇప్పటివరకూ అందకపోవడంలో ఆంతర్యం ఏమిటి?

‘పోలవరం’ ప్రాజెక్టును తలకెత్తుకోవడంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యం కంటే, వేలకోట్ల ముడుపులు దండుకోవడానికి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకోవాలన్న బాబు దుర్భుద్ధి కారణంగానే.. నేడు ‘పోలవరం’ వివాదాస్పదంగా మారింది. అయితే.. పోలవరం అంశంలో.. కేంద్ర ప్రభుత్వం.. బాబు రాజకీయ ఉచ్చులో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేకపోవడంతోనే.. ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా తీగతోపాటు డొంకంతా బయటకు వస్తోంది.

ప్రభుత్వంలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం అందినందునే.. పోలవరంతో సహా అనేక పథకాలకు కేంద్రం నిధుల మంజూరును నిలిపివేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తన వైపునుంచి ఇవ్వాల్సిన యుటిలిటీ సర్టిఫికేట్లు (యుసిలు) అందించకపోవడం, ప్రభుత్వపరంగా చొరవ లోపించడంతో.. పోలవరంతోపాటు అనేక పథకాలకు కేంద్ర నిధులు తగ్గిపోయాయి. మొత్తం 45 కేంద్ర పథకాల్లో 42 పథకాలకు కనిష్టస్థాయి నిధులు కూడా రాబట్టుకోలేకపోవడం బాబు పరిపాలనా వైఫల్యానికి తార్కాణం.

రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలనకు బాధ్యత వహించాల్సిన బాబు తన వైఫల్యాలను అధికార యంత్రాంగంపై, కొంతమంది ఐఏఎస్‌ అధికారులపై నెట్టివేసే ప్రయత్నాన్ని ఎంతో తెలివిగా చేస్తున్నారు. తానొక్కడే కష్టపడుతుంటే.. అధికార యంత్రాంగం సహకరించడం లేదని ప్రజలకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. నిజానికి, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని అధికారయంత్రాంగం ప్రయత్నిస్తుంటే గండి కొడుతున్నదే బాబు.

ఇక ‘జనసేన’ పవన్‌కల్యాణ్‌ అయితే ఇప్పటికీ బాబు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ఈ మూడున్నరేళ్లల్లో.. బాబు అనుభవం దేనికి పనికొచ్చింది? రాష్ట్రానికి ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? విభజన బిల్లులోని అంశాలను, కేంద్ర నిధుల్ని సాధించలేకపోవడంలోనా? ఫిరాయింపుల్ని ప్రోత్సహించి.. కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగ విలువల్ని పరిహాసం చేసేందుకా? వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతల్ని దబాయించడంలోనా? దేనిలో బాబు అనుభవం పనికొచ్చింది? పుష్కరాల్లో, పడవ ప్రమాదాల్లో, పోలీస్‌ ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నా.. దానికి ఎవరూ పూచీ వహించరంటే భరించాలా? ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధికి అక్కరకు రాని అనుభవం కంటే నిజాయితీ, చిత్తశుద్ధి గల నాయకత్వమే రాష్ట్రానికి మేలు చేస్తుంది.

– సి రామచంద్రయ్య (కాంగ్రెస్ మాజీ మంత్రి, టీడీపీ మాజీ ఎంపీ, ప్రజారాజ్యం నాయకుడు)

17 Comments

Filed under Uncategorized

పోల’వరాన్ని’ శాపంగా మార్చిన చంద్రబాబు

పోలవరంపై పిల్లిమొగ్గలు!
కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు ప్రదేశం సందర్శించి ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనను బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, మరి కొందరు బీజేపీ నాయకులూ కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమనీ, దానిలో జాప్యం జరిగితే బీజేపీకి చెడ్డపేరు వస్తుందనీ, పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనీ వారు మంత్రికి చెప్పారు.

‘కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లెక్క చెప్పమని మాత్రమే అడుగుతున్నాం’ అని ఆయన వివ రించారు.

‘గడ్కరీ గురించి తెలుసుకోమని చెప్పండి మీ ముఖ్యమంత్రికి. పోల వరం ప్రాజెక్టు ఆయన కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మించే సామర్థ్యం, వనరుల లభ్యత నాకుంది. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వదిలేయమని మొన్న నాగపూర్‌లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చిలక్కి చెప్పినట్టు చంద్రబాబుకు చెప్పాను. తానే చేస్తానంటారు.

జమాఖర్చుల వివ రాలపైన∙కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమంటే చెప్పరు. గుడ్డిగా నిధులు ఇచ్చుకుంటూ పోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఒప్పుకున్నా నన్ను ప్రధాని లెక్కలు అడుగుతారు.

ఒక సంవత్సరంలోనే అంచనాలు మూడు సార్లు మార్చారు. ఒకసారి రూ. 33 వేల కోట్లు అన్నారు. తర్వాత రూ. 40 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ. 50 వేల కోట్ల పైచిలుకు అంటున్నారు. ఇష్టం వచ్చిన అంకెలు చెప్పి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం ఎట్లా కుదురుతుంది? నేను అడిగేదల్లా పారదర్శకత పాటించమనే. అంతకీ సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చుకోమన్నాను. ప్రధాన కాంట్రాక్టర్‌ను మార్చవద్దని చెప్పాను. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా కోర్టుకు వెడితే ఇంకా జాప్యం జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారట.

టెండర్‌ తిరకాసు
టెండర్‌ వేయడానికి 45 రోజులు గడువు ఇవ్వాలన్నది నిబంధన. 18 రోజులు మాత్రమే ఇచ్చారు. టెండర్‌ నోటీసును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నవంబర్‌ 25 వరకూ పెట్టలేదన్నది మరో ఆరోపణ. లెక్కలు చెప్పడం చంద్రబాబుకు అల వాటు లేని పని.

కాంట్రాక్టర్లతో మాట్లాడి అధికారులకు చెప్పి ప్రాజెక్టుల అంచనాలు పెంచడం ఆనవాయితీ. నామినేషన్‌ పద్ధతి మీద పనులు కేటాయిం చడం, మాటవరుసకు టెండర్లు పిలిచినా తాను ఎవరికి ఇవ్వాలని సంకల్పిం చారో వారికి మాత్రమే అర్హత ఉండే విధంగా నిబంధనలను రూపొందించడం, అనుకున్న అçస్మదీయులకే కట్టబెట్టడం చంద్రబాబు మార్కు పరిపాలన. ఆయ నను లెక్కలు అడిగే సాహసం అధికార పార్టీలో ఎవ్వరికీ లేదు.

చంద్రబాబు వ్యవహార శైలి పట్ల ప్రధానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయనీ, ప్రజాధనం ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో విదేశీ ప్రయాణాలు చేయడం ఆయనకు నచ్చడం లేదనీ బీజేపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యా నించారు.

వేలకోట్ల రూపాయలు చిత్తం వచ్చినట్టు ఖర్చుపెడుతున్న ముఖ్య మంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేననీ, ఇది ప్రధానికి ఏ మాత్రం సమ్మతం కాదనీ ఆయన అన్నారు.

‘అంతమంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొను గోలు చేయడానికి బాబుకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హెరిటేజ్‌ఫుడ్స్‌లో వచ్చిన లాభాల నుంచి ఖర్చు చేస్తున్నారా?’ అని కూడా ప్రధాని చమత్కరించా రని ఆ పార్లమెంటు సభ్యుడు చెప్పారు.

లెక్క చెబితేనే నిధులు
లెక్క చెప్పకపోతే నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని గడ్కరీ స్పష్టం చేస్తున్నారు. ప్రధానిని కలుసుకునే అవకాశమే లేదు. ఏదైనా సమావేశంలో కలిసినా ప్రధాని ముభావంగా, దూరదూరంగా ఉంటారే కానీ కుశల ప్రశ్నలు సైతం అడగడం లేదు.

— కె. రామచంద్రమూర్తి ,సాక్షి , Dec 3,2017

[పోల’వరాన్ని’ శాపంగా మార్చిన చంద్రబాబు-ప్రజాశక్తి ,Dec 3

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ధ్యేయం అని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇపుడు ఇరకాటంలో పడ్డారు. ‘ప్రతి సోమవారం పోలవరం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పనులు వేగంగా జరుగుతున్నాయి. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కానుకగా ఇస్తా’మని ప్రకటించుకున్న చంద్రబాబు ఇపుడు పోలవరంపై ఎందుకు యుటర్న్‌ తీసుకున్నారు? విభజన చట్టంలో పోలవరం నిబంధనల ప్రకారం కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసి ఇవ్వాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టు బాధ్యతను స్వీకరించింది? కాంట్రాక్టరు మార్పును కోరిన రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఎందుకు కేంద్రం తిరస్కరించింది? అంచనాల వ్యయాన్ని నిత్యం పెంచడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? శరవేగంగా జరుగుతోన్న పనుల్ని కేంద్రం ఆపేయాలని లేఖరాయడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలుగానే భావించాల్సి ఉంది.

పోలవరంపై రాష్ట్రం చెప్పే విషయాలను కేంద్రం నమ్మడం లేదు.ప్రాజెక్టు వ్యయాన్ని 16 వేల కోట్ల నుంచి ఏకంగా 59 వేల కోట్ల రూపాయలకు పెంచడంతో కేంద్రం కూడా ఆలోచనలో పడింది. ఒకవైపు 2011-12 అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పదే పదే కేంద్రం చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించి ఇస్తామంటే రాష్ట్రం ఎందుకు భుజాన వేసుకుంది? అనేది ఇపుడు పెద్ద చర్చ జరుగుతోంది.

2019 నాటికి పోలవరం పూర్తవుతుందా?
పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలోగానే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎన్నో సార్లు ప్రకటించారు. కానీ ఇపుడున్న పరస్థితుల్లో ఇది సాధ్యంకాదని తేలిపోయింది. ఇప్పటి వరకూ జరిగిన పనులు నామమాత్రం. జరగాల్సిన పనులు ఎక్కువ. కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులను పరిశీలస్తే పనుల స్థాయి ఏమేరకు జరుగుతుందో అర్ధం అవుతుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిని నిర్మాణం చేస్తాని చెప్పి, మూడున్నరేళ్లయినా సరే కనీసం డిజైన్లు కూడా రూపొందించడం పూర్తి కాని వైనం ఒకవైపు ఉంది. తాత్కాలిక సచివాలంలోనే అరకొర వసతులో పాలన చేస్తూ అద్బుతమైన రాజధానికోసం కలలు కంటున్నారు. ఎన్నికల సమయానికి డిజైన్లు ఖరారు చేసి, అద్బుతమైన రాజధానిని నిర్మాణం చేయబోతున్నాను, మళ్లీ తననే గెలిపించాలని కోరడానికి వ్యూహం రూపొందించుకున్నారు.

అదే విధంగా 2018 నాటికి పోలవరం పనులు నామమాత్రంగా చేసి, నీళ్లు వదిలి, ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరే ఎత్తుగడతో చంద్రబాబు ఉన్నారు. దీనితోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ఆర్థకపరమైన అంశాలు కూడా ఎన్నికలకు కలిసి వచ్చేలా చేసుకోవాలనుకున్నారు.

వచ్చే ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండబోతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే పోలవరం లాంటి భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు ఆసరా అవసరం ఉంది. అందుకే కేంద్రం నిర్మాణం చేయాల్సి ఉన్నా, కాదని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. దీనివెనుక ఎన్నికల అవసరాలు ఉండటమే.

అయితే బిజెపి కూడా తక్కువేమీ తినలేదు. తమ అవసరం అనుక్షణం ఉన్నప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధులకు కూడా మోడీ పేరు చెప్పడం లేదని, బిజెపిని తలచుకోవడం లేదనే బాధ ఉంది. కేంద్రం నుంచి తీసుకునే సహాయ సహకారాలనుసైతం తమ ప్రభావంగానే చూపుకుంటున్నారు. ఇది అటు బిజెపికీ, ప్రధాని మోడీకి నచ్చడం లేదు.]

107 Comments

Filed under Uncategorized

మారిస్తేనే.. మనుగడ

మారిస్తేనే.. మనుగడ-ఆంధ్రభూమి ,నవంబర్ 19
ప్రత్యేక హోదా, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, వైసీపీ దూకుడు వంటి కీలక అంశాలతో పాటు కేంద్రంతో సత్సంబంధాలు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 60 మందిని మారిస్తే తప్ప, మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యేల చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ఠ దిగజారుతున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తుండటంతో, ద్వితీయ శ్రేణి నేతల్లో వారిపై తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతోంది. గత ఎన్నికల్లో కొత్తవారైనప్పటికీ పార్టీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో పాటు, సొంత సామాజిక వర్గం ఈసారి అధికారంలోకి రాకపోతే స్థానికంగా కూడా దెబ్బతింటామన్న ఆందోళన చెందారు. దాంతో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలు అభ్యర్థులతో సంబంధం లేకుండా, సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరీ అభ్యర్థులను గెలిపించారు. అయితే, గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు వారిని పక్కకుపెట్టి కొత్తవారిని ప్రోత్సహించడం, వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా బలపడేందుకు అప్పటినుంచే అడ్డదారులు తొక్కుతుండటంతో అంతకుముందున్న కీలక నేతలు-ఎమ్మెల్యేల మధ్య దూరం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా బలపడాలన్న తొందరలో కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి చెందిన నేతల వ్యాపారాలను దెబ్బకొట్టడమో, లేదా ఆ క్రమంలో వారి నుంచి డబ్బులు గుంజడమో చేస్తున్నట్లు నాయకత్వం దృష్టికీ వస్తోంది. మైనింగ్, ఇసుక, వైన్‌షాపులు, బార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా విధానాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు జిల్లా మైనింగ్ అధికారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన నేతల వ్యాపారాల్లో బలవంతంగా వాటాలు తీసుకోవడమో, కొత్త వైన్‌షాపు, బార్లు ఇప్పిస్తే అందులో పెట్టుబడి లేకుండా వాటా తీసుకోవడమో చేయడం గత మూడేళ్లలో కొందరు ఎమ్మెల్యేలకు అలవాటయిందన్న ఫిర్యాదులు ఇప్పటికే అధిష్ఠానం వద్ద వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు జిల్లాలో అయితే నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయి.

పరుచూరు నియోజకవర్గంలో ఒక మండలాన్ని శాసించే ఓ సీనియర్ నేత ఎన్నికల్లో అధికారంలోకొస్తే తిరుమలకు వెనక్కి నడుచుకుంటూ వస్తానని మొక్కుకుని, పార్టీ గెలిచిన తర్వాత మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు సదరు నేతకు పోటీగా వైసీపీ నుంచి వచ్చినవారిని ప్రోత్సహించడంతో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానని ఆయన బహిరంగంగానే సవాలు చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో క్వారీ లీజుకు తీసుకున్న పార్టీ నీటి సంఘం అధ్యక్షుడిని, క్వారీ పనులను అడ్డుకున్న వైనం కూడా పార్టీ దృష్టికి వెళ్లింది.

ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో పార్టీ, కులాభిమానంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న సానుభూతిపరులకు చెందిన క్వారీలన్నీ మైనింగ్ అధికారుల పేరుతో నిలిపివేయడం కూడా వ్యతిరేకతకు కారణమవుతోంది.

మరికొందరు ఎమ్మెల్యేలు మార్కెటింగ్ యార్డు, జిల్లాస్థాయి పదవుల సిఫార్సుల విషయంలో పోస్టులు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్, సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీ వంటి పోస్టింగులను అమ్ముకుంటున్న క్రమంలో, ఆ పోస్టుల్లోకి వచ్చినవారు పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా డబ్బులిస్తేనే పనిచేస్తామంటున్న వైనం కూడా కార్యకర్తల్లో కొందరు ఎమ్మెల్యేలే కారణమని చెబుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో సొంత ఖర్చులు పెట్టయినా ఓడిస్తామని నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల విచ్చలవిడి అవినీతి చర్యల వల్ల కూడా పార్టీ నష్టపోతోందన్న నివేదికలొచ్చాయంటున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు జిల్లాలో గురజాల, పెదకూరపాడు, రేపల్లె, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు, వినుకొండ వంటి నియోజకవర్గాల్లోనే పార్టీ గెలుస్తుంది.

మరికొందరు ఎమ్మెల్యేలపై నేరుగా ఆరోపణలు లేకపోయినప్పటికీ ఇప్పటివరకూ తమ పనితీరు మెరుగుపరుచుకోలేకపోవడం, అందుబాటులో లేకపోవడం, లెక్కలేనితనం, సొంత వ్యాపారాల్లో మునిగిపోయి పీఏలు, కుటుంబ సభ్యులకు నియోజకవర్గాలను అప్పగించిన వైనం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణంగా తేలింది.

29 Comments

Filed under Uncategorized

పోల ‘వరం’, కమీషన్ల ‘పరం’

‘పోలవరం’పై కేంద్ర కమిటీ సంచలన వ్యాఖ్యలు
తెలుగుగేట్ వే.కామ్ చేతిలో కేంద్ర కమిటీ నివేదిక

‘ఎంతో కీలకమైన…భారీ ఖర్చుతో కూడుతున్న పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలో ఏపీ జలవనరుల శాఖకే స్పష్టత లేదు. భారీగా పెరిగిన భూ సేకరణ..ఆర్అండ్ ఆర్ వ్యయంతో ప్రాజెక్టు లాభదాయకతపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.’ ఇదీ కేంద్ర నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాలు. అంతే కాదు..సర్కారు కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకోవటం వివాదస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యామ్ ఎత్తును 31 మీటర్ల నుంచి 42 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రతిపాదించినట్లు కేంద్ర నిపుణులు కమిటీ తన నివేదికలో కేంద్రానికి నివేదించింది. ప్రాజెక్టును చాలా ముందుగా పూర్తి చేయటానికి ఇలా చేస్తామని చెబుతోందని పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో చాలా అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. 42 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలంటే ఆ మేరకు అవసరమైన భూ సేకరర పూర్తి చేయాలి. 2019 జూన్ నాటికి మొత్తం కెనాల్ డిస్ట్రిబ్యూషన్ పనులను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.

ప్రస్తుతం కాఫర్ డ్యామ్ విషయంలో వివాదం తలెత్తటానికి ప్రధాన కారణం ఇదే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఏపీ జలవనరుల శాఖ సమర్పించిన పీఈఆర్ టి చార్ట్ ను అన్ని కాంపోనెంట్స్ ను పరిగణనలోకి తీసుకుని సవరించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఒక సారి నిర్దేశిత కమిటీ పీఈఆర్ టి ఛార్ట్ ను ఆమోదించిన తర్వాత దాంట్లో ఎలాంటి మార్పులు చేయకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన నిర్మాణ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ కు సంబంధించి ఎలాంటి వివరాలు అందివ్వలేదని. ప్రాజెక్టు ప్రయోజనం పూర్తిగా రైతులకుచేరాలంటే ఇది చాలా కీలకం అని కమిటీ నివేదించింది. కమిటీకి ప్రభుత్వం పవర్ హౌస్ కాంపోనెంట్స్ నిర్మాణానికి సంబంధించి వివరాలు సమర్పించలేదు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ ఖర్చు భారీగా 2934 కోట్ల రూపాయల నుంచి 32392.24 కోట్ల రూపాయలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించినట్లు కమిటీ తెలిపింది.

ఇది మొత్తం ప్రాజెక్టు వ్యయంతోపాటు..ప్రాజెక్టు లాభదాయకత అంశాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపనుందని నివేదిలో పేర్కొన్నారు. జలవనరుల శాఖ నివేదిక ప్రకారం 2010-11 ప్రైస్ లెవల్ ప్రకారం ప్రాజెక్టు వ్యయం 16010 కోట్ల రూపాయలు అయితే…2013-14 ప్రైస్ లెవల్ ప్రకారం ఇది 46,925 కోట్ల రూపాయలకు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ దగ్గర క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ నాణ్యతా ప్రమాణాలను మరింత సమర్థవంతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన నిపుణుల కమిటీ ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను సోమవారాన్నిపోలవారంగా మార్చి..వారం వారం సమీక్షిస్తున్నానని ప్రజలకు చెబుతుంటే..మరి కేంద్ర కమిటీ ఏంటి..అసలు ఇంత భారీ ప్రాజెక్టుపై సర్కారుకే స్పష్టత లేదని చెప్పటం ఏంటో?.

http://telugugateway.com/polavaram-expert-committe-report-shock-to-ap-govt/

34 Comments

Filed under Uncategorized