Tag Archives: jagan delhi deeksha

Support Jagan Anna

కృష్ణ జలాల కోసం దీక్ష చేపట్టిన జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ…
భరత జాతి కి అన్నపూర్ణ అయిన ఆంధ్ర ప్రదేశ్ జీవన స్థితిగతులను ప్రభావితము చేసే ఈ కృష్ణ ట్రిబునల్ తీర్పు మనకు పట్టిన దుర్గతి కి తార్కాణము. ఒక సవతి తల్లి చూపిన ప్రేమ అది కూడా బలమైన ప్రజల కోర్కెలను తీర్చగలిగే రాజకీయ నాయకుడు లేని సమయములో అలసి సొలసి ఆదమరచి వున్నప్రజలను అనాధలుగా తలచి అన్యాయముగా అసంబద్ధమైన తీర్పు ఇచ్చినది.

రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో నికర జలాల సద్విని యోగము కోసము చేపట్టిన ప్రాజెక్ట్లు అదే ఒక పది సంవత్సర ముందు చేపట్టివుంటే ఈ రోజు వాటి మీద మనకు పూర్తి హక్కు వుండేది. కానీ ఆ రోజు వున్న నార బాబు ఇంకుడు గుంతలతో కాలక్షేపం చేసి ఇప్పుడు రైతు కోసం యాత్రలంట? ఒక పక్క దేవెగౌడ ని ప్రధానమంత్రి ని చేసి చక్రం తిప్పినా అని గప్పాలు కొట్టుకొనే బాబు ఈ విషయములో కల్పించుకోలేదు? అది కూడా కేంద్ర నిధులతో అలమట్టి డ్యాం ఎత్తు పెంచారు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని తప్పు పట్టడమా? సిగ్గు సిగ్గు ..
ఇప్పుడు ఎంతటి లాయర్ ని పెడితే ఏమి లాభం?

ఐదవ తరగతి పాటం లో ముఖ్య మంత్రుల జాబితా కోసం ఎగబడి కాళ్ళమీద పడి ముఖ్య మంత్రులవుతున్న అసమర్థ రాజకీయ నాయకులకు ఒక సంకల్పం లేదు దానిని తీర్చగలిగే శక్తి లేదు. ఎంత సేపు అధిష్టానమేనా? మనకు సొంత తెలివి ఉండదా? రేపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళ అనుమతి కావాలన్టారేమో? అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు వీళ్ళకు చేత కాదు, ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు ఈ అంశం మీద, వీళ్లా మన నాయకులు? కానీ జగన్ జల దీక్షకు మాత్రం ఎవరు పాల్గొనకూడదు అని హుంకరిమ్పులు, తాయిలాలు. ఈ ముఖ్య మంత్రి కార్యచరణ ఏమిటి? ఎప్పుడు చూసినా జగన్ చేపట్టిన ప్రతి విషయములో అడ్డు చెప్పడమేనా లేక ఏమయినా ముందుగానే పరిష్కారం కనుక్కుందాం అని ఆలోచన ఏమైనా వుందా?

ప్రజలకు నమ్మకము ఉన్నంత వరకు YSR కానీ జగన్ ని కానీ ప్రజల హృదయాల లో నుండి ఏ దుష్ట శక్తి తొలగించలేదు, జగన్ చేపట్టే జల దీక్ష లో పాల్గొంటే సోనియా అహం దెబ్బ తింటుంది అనుకొంటే ఈ తీర్పుతో నలబై లక్షల ఎకరాలు బీళ్ళు అవుతున్నాయి వారి అహం సంగతి దేవుడు ఎరుగు, నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు ఇది ఏమి న్యాయం అని అడగ కూడదా? అన్యాయము జరిగినప్పుడు కష్టాలు ఎన్ని వచ్చిన ఎదురొడ్డి పోరాడేవాడే నాయకుడు. తెర చాటున రాజకీయాలు నడిపేవాళ్ళు మనకొద్దు .. మనకోసం పోరాడేవాడే మనకు ముద్దు .. జై జగన్ .. మీ సంకల్పంతో మన అన్నపూర్ణ అయిన తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి ఢిల్లీ వీధులలో చాటి చెప్పండి ఈ తీర్పు లో మార్పు వచ్చేటట్లు చేయండి..
YSR అమర్ రహే.. జై జగన్

 

20 Comments

Filed under Updates